ప్రభుత్వం ఆధ్వర్యంలో 22న ఉగాది వేడుకలు
వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : ఈ నెల 22న రవీంద్ర భారతిలో ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉగాది ఉత్సవాలను నిర్వహించనున్నట్లు తెలంగాణ సీఎస్ శాంతి కుమారి వెల్లడించారు. ఉగాది పర్వదిన వేడుకల నిర్వహణపై సీఎస్ శాంతి కుమారి గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో ప్రభుత్వ సలహాదారు రమణాచారి, అధికారులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ఉగాది వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ వేడుకలను పురస్కరించుకుని కవి సమ్మేళనం ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. ఇందుకోసం సాంస్కృతిక శాఖ ఏర్పాట్లు చేయాలని సీఎస్ అధికారులను ఆదేశించారు.