హైదరాబాద్: సెప్టెంబర్-నవంబర్ మధ్య జరిగిన యూజీసీ నెట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను UGCNET.NTA.NIC.IN లో చూసుకోవచ్చని టెస్టింగ్ ఏజెన్సీ వెల్లడించింది. యూజీసీ నెట్ అర్హత పరీక్షకు 8.6లక్షల మంది దరఖాస్తు చేసుకోగా 5.26లక్షల మంది పరీక్షకు హాజరయ్యారు. ఈ ఫలితాల్లో 3వేల676 మంది జేఆర్ఎఫ్ , 32వేల మంది 739 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు అర్హత సాధించారు. ఈ ఫలితాలతో పాటు సబ్జెక్టుల వారీగా కటాఫ్ మార్కులను సైట్ లో అందుబాటులో వుంచినట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటనలో తెలిపింది.