హైదరాబాద్ : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా తెలిపారు. తేలికపాటి లక్షణాలు ఉండటంతో కొవిడ్ టెస్ట్ చేసుకోగా పాజిటివ్ గా తేలినట్లు పేర్కొన్నారు. అవసరమైన ప్రోటోకాల్స్ ను పాటిస్తూ హోం క్వారంటైన్ లో ఉన్నట్లు వెల్లడించారు. ఇటీవల తనను కలిసిన వారంతా క్వారంటైన్ లో ఉండాలని, కొవిడ్ పరీక్షలు చేసుకోవాలని సూచించారు.
Home News