ఉద్యోగ సంఘాలపై వి.లక్ష్మీపార్వతి ఆగ్రహం
వరంగల్ టైమ్స్, విశాఖపట్నం : ఏపీ ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నేతల తీరుపై వి.లక్ష్మీపార్వతి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నేతలు గవర్నర్కు ఫిర్యాదు చేయడమేంటి? అని ఆమె ప్రశ్నించారు. సమస్యలు ఉంటే ప్రభుత్వంతో చర్చలు జరపాలని అన్నారు. అవసరమైతే సీఎం జగన్ ను కలవాలని లక్ష్మీపార్వతి సూచించారు. గవర్నర్ దగ్గరకు వెళ్లడమంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెళ్లడమే అని లక్ష్మీపార్వతి అన్నారు. ఉద్యోగులకు జీతాలు జగన్ సర్కార్ ఇస్తోందని, ఎవరికి జీతాలు రాలేదో చెప్పాలని లక్ష్మీపార్వతి ప్రశ్నించారు.