వరంగల్ టైమ్స్, హైదరాబాద్: మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర సందర్భంగా ఎమ్మెల్సీ కవిత శుభాకాంక్షలు తెలిపారు. ‘ఆధ్యాత్మికం, ఆనందం, ఆహ్లాదం.. మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర. అడవి తల్లి ఒడిలో కొలువుదీరి, ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం జాతర నేటి నుంచి ప్రారంభమవుతుందని చెప్పారు. వన దేవతల దర్శనం కోసం వచ్చే లక్షలాది భక్తజనానికి సకల సౌకర్యాలు కల్పిస్తూ రాష్ట్ర సర్కారు స్వాగతం పలుకుతోందని’ ఎమ్మెల్సీ కవిత ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.
Home News