పవన్, బాబు భేటీపై వర్మ సెటైర్లు
వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : టీడీపీ అధినేత చంద్రబాబును జనసేనాని పవన్ కల్యాణ్ కలిసిన సంగతి తెలిసిందే. వీరిద్దరి భేటీ రాజకీయాల్లో సరికొత్త సమీకరణలకు దారి తీసే అవకాశం ఉందని పలువురు భావిస్తున్నారు. టీడీపీ, జనసేనల మధ్య పొత్తు కుదురవచ్చనే చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది. ఈ నేపథ్యంలో సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు.
పవన్ కల్యాణ్ ను ఉద్దేశించి తీవ్ర విమర్శలు చేశారు. కేవలం డబ్బు కోసం తన సొంత కాపుల్ని కమ్మోళ్లకు అమ్మేస్తాడని తాను ఊహించలేదని అన్నారు. ‘RIP కాపులు, కంగ్రాట్యులేషన్స్ కమ్మోళ్లు’ అంటూ ట్వీట్ చేశారు. వర్మ ట్వీట్ పై జనసేన కార్యకర్తలు, పవన్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు.