హైదరాబాద్: క్యాన్బెరాలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో వన్డేల్లో విరాట్ కోహ్లీ , డ్యాషింగ్ బ్యాట్స్‌మెన్ మరో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు .వన్డేల్లో అత్యంత వేగంగా 12 వేల పరుగులు సాధించిన క్రికెటర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు. కేవలం 251 వన్డేల్లో విరాట్ ఈ ఘనతను సాధించాడు. 242వ ఇన్నింగ్స్‌లో ఈ ఫీట్‌ను అందుకున్నాడు. వన్డేల్లో విరాట్ కోహ్లీ బ్యాటింగ్ యావరేజ్ 59.41గా ఉంది. 43 సెంచరీలు ఉన్నాయి. పరిమితి ఓవర్ల క్రికెట్లో తనకు సాటి లేరన్న రీతిలో బ్యాటింగ్‌తో ఆకట్టుకుంటున్నాడు. కోహ్లీ 242, సచిన్ 300, పాంటింగ్ 314, సంగక్కర 336, జయసూర్య 379వ ఇన్నింగ్స్‌లో 12 వేల పరుగుల మైలురాయిని దాటారు. కోహ్లీ దూకుడుకు సచిన్ రికార్డులు ఒక్కొక్కటి కనుమరుగవుతున్నాయి. సచిన్ 300 ఇన్నింగ్స్‌లో 12 వేల పరుగులు చేయగా.. కోహ్లీ 242 ఇన్నింగ్స్‌లోనే ఆ ఘనతను సాధించాడు. వన్డేల్లో అత్యంత వేగంగా 8వేలు, 9 వేలు, పది వేలు, 11 వేల పరుగులు సాధించిన క్రికెటర్‌గా సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. 16 ఓవర్లలో రెండు వికెట్లకు 85 రన్స్ చేసింది. కోహ్లీ 31, అయ్యర్ 2 రన్స్ తో క్రీజ్‌లో ఉన్నారు.