వరంగల్ జిల్లా : వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ లో మిర్చి రైతులు కన్నెర్రచేశారు. ఆరుగాలం శ్రమించిన పంటను వ్యాపారులు దోపిడీ చేస్తుండటంతో తిరుగుబావుటా ఎగరవేశారు. భారీగా ధర తగ్గించడంతో ఆగ్రహించిన రైతులు ఆందోళన బాటపట్టారు. తేజరకం మిర్చికి క్వింటాల్ ధర రూ. 17,200 పలుకగా వ్యాపారులు మార్కెట్ లో ధర రూ.14 వేలు మాత్రమే నిర్ణయించింది. మిర్చి కొనుగోళ్లు జరుపుతున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
సోమవారం మిర్చి యార్డు కార్యాలయాన్ని ముట్టడించి ఆఫీసులో ఫర్నీచర్ ధ్వంసం చేశారు. అనంతరం నిరసన ర్యాలీ నిర్వహించి ప్రధాన గేటు ముందు రైతులు ధర్నా చేపట్టారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్నా పోలీసులు రంగంలోకి దిగారు. రైతులతో మాట్లాడి ఆందోళన విరమించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే రైతులు మాత్రం ఆందోళన విరమించే ప్రసక్తే లేదని మొండికేసి కూర్చుకున్నారు. తమకు న్యాయం జరిగేంత వరకు ఆందోళన ఆపే లేదంటూ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ ప్రధాన గేటు వద్ద నిరసన వ్యక్తం చేస్తున్నారు.