వరంగల్ టైమ్స్, వరంగల్ జిల్లా: రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని తక్షణమే ఆస్పత్రికి తరలించి మానవత్వాన్ని చాటుకున్నారు వరంగల్ పోలీస్ కమిషనర్ డా. తరుణ్ జోషి. నార్లాపూర్-కొత్తూరు మార్గంలో ద్విచక్ర వాహనాన్ని కారు ఢీ కొట్టడంతో గాయపడి స్పృహ తప్పి రోడ్డుపై పడిపోయాడు. అదే సమయంలో అటుగా వెళ్తున్న వరంగల్ పోలీస్ కమిషనర్ తీవ్రంగా గాయపడిన సదరు వ్యక్తిని పోలీస్ కమిషనర్ స్థానికంగా విధులు నిర్వహిస్తున్న పోలీస్ అధికారులతో కలిసి మెరుగైన చికిత్స అందించేందుకు అంబులెన్స్ లో స్థానికంగా వున్న ఆస్పత్రికి తరలించారు. పోలీసులు స్పందించిన తీరుపై మేడారంకు తరలివచ్చిన భక్తులు పోలీసులను అభినందించారు.
Home United Warangal