కాన్పు తర్వాత ఎప్పుడు సెక్స్ లో పాల్గొనాలి ?
వరంగల్ టైమ్స్, హెల్త్ డెస్క్: వైవాహిక జీవితంలో సెక్స్ జీవితం ఒక ముఖ్యమైన భాగం. భార్యాభర్తల బంధం మరింత బలంగా ఉండాలంటే లైంగిక సంతృప్తి ముఖ్యం. అయితే ప్రసవం తర్వాత దంపతులు ఎప్పుడు శృంగారంలో కొనసాగించవచ్చనే విషయంపై చాలా మందికి తెలియక అయోమయం అవుతుంటారు. ఒక బిడ్డ పుట్టిన తర్వాత భార్యాభర్తలు ఎంతకాలం తర్వాత సెక్స్‌లో పాల్గొనవచ్చో తెలియక గందరగోళం ఏర్పడడం సహజం. ఎందుకంటే ప్రసవం తర్వాత స్త్రీల శరీరంలో మార్పులు వస్తాయి. అంతే కాదు బిడ్డను చూసుకునే సమయంలో సరైన నిద్ర లేకుండా శరీరం అలసిపోతుంది. దీంతో చాలా మంది జంటలకు తమ లైంగిక జీవితాన్ని ఎప్పుడు ప్రారంభించాలో తెలియదు.
ప్రసవం తర్వాత సెక్స్ లో పాల్గొనేందుకు కొత్త తల్లులకు చాలా ముఖ్యం. ప్రసవ సమయంలో శారీరక, మానసిక మార్పులు స్త్రీ కోరిక, సెక్స్ సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తాయి. అప్పుడు లైంగిక కార్యకలాపాలను తిరిగి ప్రారంభించడానికి ఇది సరైన సమయం కాదని అనిపిస్తుంది. ప్రసవం తర్వాత స్త్రీకి జననేంద్రియ నొప్పి, రక్తస్రావం, అలసట రావడం సహజమని గైనకాలజిస్ట్ అంటున్నారు. కాబట్టి ప్రసవానంతర రక్తస్రావం ఆగే వరకు భార్యాభర్తలిద్దరూ వేచి ఉండటం చాలా ముఖ్యం.
ఇది సాధారణంగా 4 నుండి 6 వారాలు పడుతుంది. కానీ కొంతమంది స్త్రీలలో దీనికి ఇంకా ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంటుంది. ప్రసవం తర్వాత, రక్తస్రావం ఆగిపోయే వరకు వేచి ఉండటం మంచిది. అంతేకాదు గర్భనిరోధకాలను ఉపయోగించడం అవసరం. ఈ సమయంలో మీ భాగస్వామికి ప్రేమ, అవగాహన ఇవ్వండి. ప్రసవం స్త్రీలకు మానసిక సమస్యలను కలిగిస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండటం మంచిది.