ఈసీ మెంబర్ గా నన్ను గెలిపించండి : దయ్యాల అశోక్
వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : హైదరాబాద్ సోమాజిగూడా ప్రెస్ క్లబ్ ఎన్నికలలో ఈసీ మెంబర్ గా జర్నలిస్ట్ దయ్యాల అశోక్ పోటీ చేస్తున్నారు. ఈనెల 13న సోమాజీగూడ ప్రెస్ క్లబ్ ఎన్నికలు నిర్వహించనున్న విషయం తెలిసిందే. వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఇ.జనార్దన్ రెడ్డి సమక్షంలో మా సినిమా ఫోటో జర్నలిస్ట్ సోదరులు, సహచర మిత్రులతో కలిసి జర్నలిస్ట్ దయ్యాల అశోక్ ఈసీ మెంబర్ గా నామినేషన్ సమర్పించారు. అయితే జర్నలిస్టుల సమస్యలను దగ్గరుండి చూసిన వ్యక్తిగా, తోటి జర్నలిస్టుల అవసరాలను గుర్తించిన జర్నలిస్టుగా తాను మంచి చేసే ఆలోచనతో ఒక అడుగు ముందుకు వేస్తున్నట్లు దయ్యాల అశోక్ తెలిపారు. జర్నలిజంలో ఫీల్డ్ వర్క్ తో పాటు, జర్నలిస్టుల హక్కులను కాపాడేందుకు ప్రెస్ క్లబ్ లో ఒక సభ్యుడిగా ఉండటం చాలా మంచిదని ఆయన అన్నారు. మార్చి 13న సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో జరుగబోయే ఎన్నికల్లో ఈసీ మెంబర్ గా తనను గెలిపించాలని ఆయన కోరారు. ప్రెస్ క్లబ్ ఎన్నికలలో మీ విలువైన ఓటు వేసి గెలిపిస్తారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. మీ సహకారం, ప్రోత్సాహం కావాలని తోటి జర్నలిస్టులకు విన్నవించారు. నిరంతరం మీకు అందుబాటులో ( దయ్యాల అశోక్, జర్నలిస్ట్, సెల్ : 9550889907) ఉంటూ మీ సలహాలు సూచనలు తీసుకుంటానని తెలియజేస్తున్నట్లు దయ్యాల అశోక్ వెల్లడించారు. అనంతరం గౌరవనీయులైన సీనియర్ జర్నలిస్టులకు, తోటి జర్నలిస్టు మిత్రులకు, శ్రేయోభిలాషులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు.